ఇవి నిషిద్దాక్షరాలు

సమాజంలో ఇప్పటికీ స్త్రీలు మాట్లాడకూడని నిషేధాలున్నాయి. చర్చించటం తప్పనే కట్టుబాట్లు ఉన్నాయి. దేన్నైతే నిషేధించారో దాన్నే తన చిత్దరాలకు ప్రేరణగా తీసుకొంటుంది.సంచలనాత్మక భారతీయ చిత్రకారిణి ఇందు హరికుమార్. రెండేళ్ళక్రితం హాండ్రెడ్ ఇండియన్ టిండర్ టేల్స్ అనే వంద సచిత్ర కథనాల సంకాలనంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఇందు హారికూమార్.ఇప్పుడామే ఇంకో ప్రయోజగం చేస్తోంది.భారతీయ స్త్రీల లైంగిక అనుభవాలు చిత్ర లేఖన సంకలనాన్ని తీసుకురాబోతుంది. స్త్రీల లైంగిక వాంఛల అభివ్యక్తికరణతో ఆమె తన కొత్త చిత్ర లేఖనలను తెస్తోంది. మాట్లాడేందుకు ఇష్టపడని ,మొహామాటపడే సబ్జక్ట్ నే ఎంచుకొంటుంది ఇందు హారికుమార్.