నాకు మేకప్ వేసుకోవటం అంటే ఎంతో క్రేజ్ అంటోంది పూజాహెగ్డే . ఎంత బిజిగా ఉన్నాసరే మేకప్ కు సంబందించిన సామాగ్రి ఎదురుగ్గా ఉంటేసారే అక్కడే ఆగిపోతా కొత్తవి కనబడ్డాయా వెంటనే కొనేస్తా . మా ఇంటినిండా అనే కనిపిస్తాయి . నా తో షాపింగ్ కు వచ్చేవాళ్ళు నేను మేకప్ సామాగ్రి పైన పెట్టే ఖర్చు చూసి ఆశ్చర్య పోతారు . ఒక్కసారి నా తీరు చూసి నేనే భయపడుతుంటా కూడా అంటుంది  పూజాహెగ్డే. ముంబయ్ లో పుట్టి పెరిగిన పూజా మాతృ భాష అయిన తుళు తో పాటు కన్నడ,హిందీ ఇంగ్లిష్ భాషల్లో అనర్ఘళంగా మాట్లాడ గలదు . కాలేజ్ రోజుల్లోనే తాల్లి  నిర్వహిస్తున్న నెట్వర్క్,మానిటరింగ్ వ్యాపార వ్యవహారాలు చూసేదిట.ఈ పరిచయాలు,పద్దతిగా మాట్లాడే తీరు సినిమాల్లో తనకు ఏపని వచ్చాయంటోంది  పూజాహెగ్డే.

Leave a comment