ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ రోజంతా మనలను ఆరోగ్యాంగా ఉంచుతుంది . ఇందులో విన్న పోషకాలు ఉండేలా చూసుకోవాలి . పాలు,ఓట్స్ ,కార్న్ ప్లేక్స్ కొంతవరకు పోషకాలు ఇస్తాయి . వీటితో పాటు బాదం ,ఆక్రోట్ ,తాజాపండ్లు కూడా తీసుకొంటే ఇంకొన్ని ఖనిజాలు,విటమిన్-సి ఉంటాయి . ఉదయం బయలు దేరి ఆఫీస్ కు వెళ్ళేవారు ,దోసెలు,ఇడ్లి లు వంటివి వేసుకొనే సమయం లేకపోతే ఈ బ్రేక్ ఫాస్ట్ మరింత ఆరోగ్య కరంగా చేసుకోవాలి . ఉడికించిన గింజలు,రొట్టెలు,చిరుధాన్యాల జావా,నూనెలో వేయించినని కొన్ని,బియ్యం చేసిన పదార్దాలు,తీపి,పండ్లరసాలు కూడా ఉదయపు ఆహారంలో చేర్చుకొంటే ,మాంసకృత్తులు ,కాల్షియం రకరకాల విటమిన్లు లభిస్తాయి .

Leave a comment