సాధారణంగా అమ్మాయిలు కేశాల స్టైలింగ్ కోసం స్టైలనర్ లో హెయిర్ డ్రయర్లు వాడుతూనే ఉంటారు అయితే ఈ సాధనాలతో జుట్టుని స్టైలింగ్  చేసే ముందర వేడి నుంచి జుట్టుకు రక్షణ ఇచ్చేందుకు గాను క్రీమ్ గాని సీరమ్ గాని రాసుకోమంటున్నారు . ఇది జుట్టు దెబ్బతినకుండా రంగు మారకుండా చూస్తుంది. హెయిర్ స్ట్రయిట్ నర్ ఒకసారి వాడిన చోట్ల మళ్ళి వాడకూడదు. రెండు మూడు సార్లు వేడికి గురయితే జుట్టు ఎక్కువగా దెబ్బతింటుంది నెలకోసారి జుట్టుకు హెయిర్ మాస్క్ వేసుకోవటం,నూనెతో మసాజ్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా వుంటుంది. సాధ్యమైనంత వెడి మరీ అవసరం లేని హెయిర్ స్టయిల్స్ ట్రై చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రతిసారి హెయిర్ డ్రైయర్స్ వాడే కన్నా సహజంగా ఎండలో జుట్టును ఆరబెట్టుకోవటమే మంచిది.

Leave a comment