వేసవికి జుట్టు పాడవకుండా ఇంట్లో చేసుకొనే నూనె మంచి పరిష్కారం . కొబ్బరి నూనె అరకప్పు ,ఆముదం టేబుల్ స్పూన్ ,కలిపి వెచ్చ పెట్టాలి. ఎండిన మందార పూల పొడి ఓ టేబుల్ స్పూన్ ఈ నూనెలో కలపాలి. విటమిన్ ఇ జెల్ కాప్యూల్స్ ఓ ఐదు. ఈ చల్లారిన నూనెలో కలపాలి. టిట్రీ ఆయిల్ నాలుగైదు చుక్కలు వేయాలి. వీలైతే ఎండిన కరివేపాకు పొడి కూడా నూనెలో కలిపి దీన్ని రెండు రోజుల అలా వదిలేసి వడకట్టిన నూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకు రాసి మాసాజ్ చేసుకోవాలి. రాత్రంతా అలా నూనెతో వదిలేసి ఉదయం తలస్నానం చేస్తే జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment