ఇది కెనడా మహిళల చిట్కా

ఆరోగ్యవంతమైన శిరోజాల సంపదను కాపాడుకోనేందుకు ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎన్నేన్నో సహజమైన విధానాలు పాటిస్తూ ఉంటారు. జుట్టు పట్టులా మెత్తగా మెరిసేందుకు ఐర్లాండ్ మహిళలు వర్ణపు నీటీతో తలస్నానం చేస్తారు. ఈ నీళ్ళ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతారు కెనడా మహిళలు.ఒక చిన్న చిట్కా పాటిస్తారు.సాయంత్రాలు తలస్నానం చేస్తారు.ఎనభై శాతం ఆరిపోయాక రెండు జడలు వేసుకొంటారు. మర్నాడు వాటిని విప్పేసి చేతి వేళ్ళతోనే దువ్వుకొన్నట్లు గా చేస్తారు.ఆ తర్వాత తేడా స్పష్టంగా కనిపిస్తుంది అంటారు వీళ్ళు. ముందుగా వేడి నీళ్ళు వెంటనే చల్లని నీళ్ళతో తలస్నానం చేస్తే ప్రకాశవంతంగా మారిపోతాయి వెంట్రుకలు అంటారు వీళ్ళు.