ఓ నటిగా నాకు మంచి గుర్తింపు వస్తే చాలు. హీరోయిన్ గానే కనిపించాలని నేనెప్పుడూ కోరుకోలేదు కొన్నింటిలో మొహమాటం వదిలిపెట్టి విలన్ గా కూడా నటించా అంటోంది వరలక్ష్మి శరత్ కుమార్ .తమిళనాడు లో ఆమె నటించిన సినిమాల సంఖ్య పాతికపైనే ఉన్నాయి. తెలుగు లో చాలా తక్కువే కాకపోతే తమిళ సినిమాలు తెలుగులోకి రావటం వల్ల వరలక్ష్మి పరిచితురాలే హీరోయిన్ ల ప్రతికూల పాత్రలు చేయాలంటే సాధారణంగా సందేహిస్తారు. నాకు అటువంటి భయాలు ఏవీ లేవు . పాత్రకు సూటవుతాను అనుకొంటే తప్పకుండా నటిస్తాను నాపాత్రకు నేనే డబ్బింగ్ కూడా చెప్పుకుంటాను అంటోంది వరలక్ష్మి శరత్ కుమార్. సెలెబ్రెటీ కిడ్ అయివుండి కూడా ఇలా సింపుల్ గా ఉండటం ప్రత్యేకమే మరి అంటున్నారు విమర్శకులు కూడా.

Leave a comment