హడావుడిగా ఆఫీస్ పని, ఇంటి పనిలో నీళ్ళు సరిగా తాగక డీహైడ్రేషన్ సమస్య వస్తోంది. అలాంటి ఇబ్బంది రాకుండా నీటిశాతం అధికంగా వుండే కీర దోస ఎక్కువగా తింటే మంచిది. అలాగే విటమిన్-సి నీటి శాతం అదికంగా ఉన్న ముల్లంగి కూరల్లో భాగంగా చేసుకొంటే చాలా మంచిది. ఇక సొరకాయి బీరకాయి అయితే శరీరంలో నీటి నిల్వలు కోల్పోకుండా చేస్తాయి. జ్వరంతో బాధపడుతున్న ,వారికీ గర్భవతులకు ఈ రెండు విరివిరిగా తినమంటారు వైద్యులు ,వాటిలో వుండే పీచు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది బీరకాయి లోని సి విటమిన్ జింక్,థయామిన్ వంటి పోషకాలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థ పని తీరుని మెరుగు పరుస్తాయి కూడా.

Leave a comment