పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఇయర్ బడ్స్ తో చెవిలో తిప్పుతుంటారు. ఈ అలవాటు చాలా మందికి వుంటుంది. కానీ ఇవి ఉపయోగించడం అంత మంచి అలవాటు కాదంటారు. ఇయర్ స్పెషలిస్ట్ లు. వీటి ద్వారా చెవిలో వీటి ద్వారా చెవిలో గుబిలి తొలగించడం మంచి అలవటు కాదని, వీటి వల్ల చెవిలో సున్నితమైన భాగాలు దెబ్బతింటాయని చెపుతున్నారు. ఇయర్ వాక్స్ కొన్ని రోజుల తర్వాత, దానంతట అదే బయటకు వస్తుందని దాన్ని ప్రత్యేకంగా తీయనక్కరలేదని చెపుతున్నారు. అయితే దీన్ని తొలగించే సమయంలో ఈ బడ్ ఉపయోగించడం వల్ల అమెరికాలోని ప్రతి రోజు సుమారు 34 మంది గాయపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారట. వారంలో నలుగు నుంచి ఎనిమిది సంవత్సరాలలోపు వారేనని రిపోర్టు. చిన్న పిల్లల చేతికి ఏవి దొరికినా ప్రమాదమే. పెద్ద వాళ్ళు అలవాటు కొద్ది చేసే పనో పిల్లల ప్రాణాలపైకి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Leave a comment