ఈ షోలు ఎంతో దారుణం

గురు బ్రహ్మ,గురు విష్ణు అంటునే ఈ చవకబారు రియాల్టీ షోలు పాలు గారే పసి వయసును,పసి మనసుల్లోని అమాయకత్వాన్ని పాడుచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది గాయని రేఖ భరద్వాజ్ మ్యూజిక్ రియాల్టీ నిర్వహణలో పని వాళ్ళ చేత పాడిస్తున్న పాటల గురించి ఆమె బాధపడ్డారు. అసలది మ్యూజిక్ కాదు,వట్టి ధ్వని,అలాటి షోలలో నన్ను భాగస్వామిని చేయద్దని నేను భగవంతుడిని ప్రార్ధిస్తున్నా అంటూ రేఖ భరద్వాజ్ ట్విట్ చేశారు. ఈమె సినినేపద్య గాయని,బాలీవుడ్ తో పాటు బెంగాలీ,మరాఠీ పంజాబ్ మలయాళ సినిమాలకు పాటలు పాడింది రేఖ. దర్శకుడు విశాల్ భరద్వాజ్ భార్య.