దువ్వటమే జుట్టుకు పోషణ

పెళ్ళిళ్ళ సమయంలో జపాన్ లో కొత్త పెండ్లి కూతురికి చెక్కతో చేసిన దువ్వెనలను కానుకగా ఇస్తారట. ఇది వాళ్ళ సంప్రదాయం జుట్టుతో పదేపదే దువ్వటం వల్ల శిరోజాలు అందమైన మెరుపుతో ఉంటాయని వాళ్ళ నమ్మకం దువ్వెనతో రోజుకు నాలుగు సార్లు దువ్వితే జుట్టు పట్టులా మెత్తగా మెరుస్తుంది. ఆముదంలో పలుకులుగా దంచిన వెల్లుల్లి ఒక చుక్క లవెండర్ కలిపి నిద్రపోయే ముందర జుట్టుకు పెట్టుకొంటారు.ఇది జుట్టుకు తేమ అందించి చిక్కుల్లేకుండా పొడుగ్గా పెరిగేలా చేస్తుందని వాళ్ళ నమ్మకం అలవాటు కూడా.