వర్షాలకు చెమ్మతో ఇంట్లో,బాత్ రూమ్స్ లో ఒకలాంటి తేమ వాసన వస్తోంది. ఆ వాసన పోవాలంటే ఇంట్లో కొన్ని వస్తువులతో నిమ్మ ఉప్పు బిళ్ళలు తయారు చేసుకొని ఇంటి మూలల్లో వుంచితే ఆ వాసన పోతుంది. ఒక పాత్రలో పావు కప్పు వంట సోడా తీసుకోవాలి దీనిలో పావు కప్పు నిమ్మ ఉప్పు (సిట్రిక్ యాసిడ్ )కలిపి పాత్రలు టోమ్ ద్రావణం ఒక స్పూన్ ఇందులో వేయాలి. ఈ మిశ్రమాన్ని చేతో కలిపి ఒక ఐస్ ట్రే లో పోస్తే ఆరిపోయాక చిన్న బిళ్ళలుగా గట్టిగా అయిపోతాయి. వీటిని స్నానాల గదుల్లో ,ఇంట్లో గదుల మూలల్లో,టాయిలెట్లు,సింకు లో వస్తే మంచి వాసన వస్తుంది. దుర్వాసన దూరం అవుతుంది.

Leave a comment