సూపర్ బైకర్ నీహారిక యాదవ్

లైఫ్ లో దేనికీ భయపడ కూడదు అంటుంది నీహారిక యాదవ్ . ఈ సూపర్ బైకర్ వృత్తి రీత్యా డేటా సర్జన్ . నేనెప్పుడూ ఈ స్పోర్ట్స్ ని మేల్ డామినేటింగ్ స్పోర్ట్స్ గా చూడలేదు . పురుషులతో ధీటుగా ఎప్పుడు ఉన్నాను భారతదేశంలో 1000 సిసి బైక్ తో రేస్ లో పాల్గొనే మహిళలు లేరు . 2005 లో నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది . కుడిచేయి 50 శాతం మూవ్ మెంట్ తగ్గిపోయింది . నేను బైక్ రేసింగ్ లో ఉండేందుకు ఈ యాక్సిడెంట్ ఏమీ అర్ధం కాలేదు లైఫ్ లో ఛాలెంజెస్ ఎదుర్కొంటేనే బావుంటుంది . నా కాన్ఫిడెన్స్ నా ప్రయాణాన్ని తీర్చిదిద్దింది . దూకాయి పాణి గ్లే 899 సిసి నా రేసింగ్ బైక్ . నేను గంటకు 285 కిలో మీటర్ల వేగంతో వెళ్ళాను . నిరంతరం ప్రాక్టీస్ చేస్తాను . బెస్ట్ గా నిలబడ గలుగుతాను అంటుందీ బైక్ రేసర్ డా.నీహారిక యాదవ్ .