వజ్రం లాంటి నాణెం  

కెనడియన్ రాయల్ మింట్ ఒక చక్కని వజ్రాన్ని పొదిగిన వజ్రపు రూపంలో ఉన్నా నాణేన్ని విడుదల చేశారు .చరిత్ర లో ఇంత వరకు ఎన్నో నాణేలు బంగారం వెండి ఉన్నాయి కానీ ఇలాటి వజ్రం పొదిగిన నాణెం పైగా వజ్ర రూపంలో ఉన్న నాణెం మటుకు ఇంత వరకు ప్రపంచం  లో లేదు. దీని తయారీలో 85 గ్రాముల వెండి ౦.2 నాణెం కేరెట్ బరువు గల వజ్రం పొదిగారు .ఈ వజ్ర ఖచిత నాణెం విలువ 50 కెనడియన్ డాలర్లు.రిటైల్ మార్కెట్ లో 1500  కెనడియన్ డాలర్లు అంటే మన రూపాయిల్లో 85,000 ఖరీదు పలుకుతుంది  . కెనడియన్ రాయల్ మింట్ ఇలాటి నాణేలు 7౦౦ విడుదల చేసింది .