డార్క్ అండ్ లవ్ లీ

కెనడా నుంచి జైనాబ్ అన్వర్ అనే నటి డార్క్ అండ్ లవ్లీ పేరుతో పోస్ట్ చేసిన ఒక ఫోటోని లక్షల మంది అభినందిస్తున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన చిత్రకారిణి వసే కా నహర్ చామన చాయతో ఉన్న ఒక యువతి చిత్రాన్ని గీసి ఆ యువతి చేతిలో డార్క్ అండ్ లవ్ లీ పేరుతో ఉన్న ఒక బ్యూటీ క్రీం ట్యాబ్ ను ఉంచింది. నల్లగా ఉన్న అది కూడా గొప్ప అందమేనని చెప్పేందుకే నేను ఆ నల్లని అమ్మాయి బొమ్మ గీశానని చెప్పింది వసేకా నహర్. ఆ చిత్రం చూసి తనను తాను ఆ చిత్రంలా అలంకరించుకొని జైనాబ్ అన్వర్ చేతిలో క్రీం ఉన్నా ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళే నేను తెల్లగా ఉండాలని ఎన్నో క్రీంలు కొనేవాళ్ళు మా ఇంట్లోనే కాదు సమాజంలోనూ అదే వివక్ష. అందం అంటే శరీర వర్ణాల్లోనే కాదని తెలియజెప్పేందుకే ఈ పోస్ట్ అంటోంది జైనాబ్ అన్వర్.