దంతాలు మెరుపుతో 

కాఫీ,టీ,కూల్ డ్రింక్ లలో ఉండే ఆమ్ల తత్వంతో దంతాలపైనా గార ఏర్పడుతోంది. దంతాలపైనా ఎనామిల్ పాడవకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. నిమ్మరసం పేస్ట్ వంట సోడా కలిపి వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. కొంచం పేస్ట్ ను కప్పులో వేసి అందులో ఐదారు చుక్కల నిమ్మరసం వంట సోడా వేసి మెత్తగా పేస్ట్ లాగా కలిపి దానితో దంతాలను బ్రష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి వాడిన గార పోతుంది. అలాగే రాతి ఉప్పు మెత్తగా దంచి అందులో బొగ్గుపొడి కలిపి దంతాలు తోమితే దంతాలు మెరిసిపోతాయి ఉప్పులో ఉండే ఖనిజాలు పళ్ళకు చాలా మేలుచేస్తాయి.