ప్రతి పనిలో ఎదో ఒక కష్టం వున్నట్లే డబ్బు లెక్కపెట్టడంలో కూడా రిస్క్ ఉందిట. ఇంకేం లెక్క బడతాం ఇప్పుడు అసలు చేతిలో డబ్బు ఆడితే కదా అనకండి. తీరిగ్గా వున్నాకదా ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్పుకుందాం. ఇచ్చి పుచ్చుకునే క్రమంలో కరెన్సీ నిత్యం కొన్ని వేల లక్షల మంది చేతులు మారుతూ వుంటుంది. వైద్య రంగంలో వున్న వాళ్ళను మినాహాయిస్తే మేగతా సామాన్య ప్రజలు అందరి చేతుల్లోను కాస్తో, కుస్తో బాక్టిరీయా వుండే వుంటుంది. డబ్బు జేబుల్లో, పర్సుల్లో, బ్యాగుల్లో, వుంచేస్తూవుంటాం వాటికి రకరకాల ప్రదేశాల్లోనుంచి డబ్బు కరెన్సీ లోకి చేరిపోతుంది. పరిశోధకుల లెక్కల ప్రకారం 78 రకాల బాక్టిరియాతో పాటు యంటి బయాటిక్ నిరోధక జీవులు కూడా ఈ నోట్ల కట్టలపై ఉంటాయిట. ఇవన్నీ ముట్టుకుని లెక్క పెట్టడం వల్ల ఎన్నో రకాల చర్మ వ్యాధులు, ఇతర అంటు వ్యాధులు వచ్చె అవకాసం వుందని ముఖ్యంగా 10,20,100 రూపాయిల నోట్లపై ఈ బాక్టిరియ కుప్పలుగా వుందని అంటున్నారు. కనుక ప్లాస్టిక్ కరెన్సీ గనుక వస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చంటాయి అడయాయినాలు. క్రిడిట్,  డెబిట్ కార్దుల తో పాటు బ్యాంకు కార్డుల వినియోగం పెరిగితే సమస్య నుంచి బయట పడవొచ్చు అంటున్నారు పరిశోధకులు.

Leave a comment