క్లాసీ లుక్ ఇచ్చే గళ్ళ డిజైన్స్

కంచిపట్టు చీరెలపైన జరీ చక్స్ ,ఫ్యాన్సీ చీరెలపైన మల్టీకలర్ చక్స్ చాలా బావుంటాయి. క్లాసీలుక్ తో ఆకట్టుకోవాలన్న, క్యాజువల్ గా ఫ్యాషన్ గా కనిపించాలన్న చక్స్ ని మించిన డిజైన్స్ ఇంకోటి లేదు. చీరెలే కాదు లేత రంగులో ప్లెయింగ్ బెక్స్ ఇటు షర్ట్ లకు స్కర్ట్ లకు కూడా అందాన్నిస్తాయి. నలుపు బూడిద రంగు తెలుపు వంటి సాదా రంగుల టీ షర్టులకు చెక్స్ ఫ్యాంట్స్ చక్కగా నప్పుతాయి. టార్జాన్ చెక్స్ ,ప్లెయిడ్ చెక్స్ ,మైక్రో మాక్రో చెక్స్ ఇటు సంప్రదాయ వస్త్ర శ్రేణిపైనా ,ఆధునిక దుస్తులపైన కూడా అందంగా అమరిపోతాయి.