ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో బలగానపల్లి గ్రామంలో నంద్యాల రహదారిలో నందవరంలో వెలిసింది చౌడేశ్వరీ దేవి.

పూరాతన కథలను పరిశీలిస్తే నందవరం పాలించే రాజుగారికి సిద్ధుడు అనబడే వాడు ఒక లేపనం ఇచ్చినాడు. రాజు,రాణిగార్లు అరికాళ్ళకు ఆ లేపనం రాసుకుని కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేవారు.ఒకరోజు వారికి లేపనం ఆరిపోయి కాశీలోనే వుండిపోయారు.అక్కడ పూజారుల మంత్ర జపంతో ఇరువురు కోటకి వచ్చేశారు.వారి సహాయమునకు కృతజ్ఞతతో వారికి తప్పకుండా అవకాశం వచ్చిన సహాయం చేస్తాను అనిన కొద్ది రోజులకు నందవరంలో కరువు తాండవం చేయగా పూజారులు సహాయార్ధం నందవరం వచ్చారు.మాట ఇచ్చిన విషయం మరిచారు రాజుగారు సాక్షానికి కాశీ విశాలాక్షి ని రమ్మని ఆదేశించారు కాగా వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్ళాలని చెప్పిన ఆ కాశీ విశాలాక్షి పురోహితులు నందవరం పరిచయం చేయడానికి వెనుకకు తిరిగిన ఆ దేవి అక్కడే శిలామూర్తిగా ఉండిపోయింది.
రాజుగారు చౌడేశ్వరీదేవిగా ఆలయ నిర్మాణం చేశారు.కోరికలు తీర్చే దేవత.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పొంగలి,పులిహోర

      -తోలేటి వెంకట శిరీష 

Leave a comment