చాక్లెట్ మేకప్

కాస్త ప్రత్యేకంగా కనిపించాలి అనుకొంటే బ్రౌన్ మేకప్ వేసుకోండి అంటున్నారు మేకప్ ఆర్టిస్ట్ లు . ఈ చాక్లెట్ కలర్ ఇవ్వాల్టి మేకప్ ట్రెండ్ . కళ్ళను క్లాసిక్ ఐ లైనర్ తో మెరిపించటం ఫ్యాషన్ . లైన్డ్ ఐ లైనర్ సరిగ్గ సూటవుతుంది . ఇది అన్ని సందర్బల్లోనూ బావుంటుంది . కళ్లచుట్టూ చాక్లెట్ కలర్ మేకప్ బ్రష్ తో వేస్తే కళ్ళు బోల్డ్ గా కనిపిస్తాయి . పెళ్ళి వేడుకలకు పార్టీలకు స్మార్ట్ ఐస్ లుక్ చాలా బావుంటుంది . జుట్టుకు వేసే రంగుల్లో చాక్లెట్ డై వాడచ్చు . ఒక ఫ్యాషన్ బుల్ లుక్ తో కనిపించవచ్చు . ఇక గోళ్ళకు పెదవులకు కూడా బ్రౌన్ కలర్ నెయిల్ పాలిష్ లిప్ స్టిక్ లతో స్టయిల్ గా కనబడతారని చెపుతున్నారు ఎక్స్ పార్డ్స్ . ఈ చాక్లెట్ కలర్ మేకప్ తో కళ్ళు పెదాలు ,బుగ్గలు మరింత మెరుపులు మెరుస్తాయి .