చిటికెలో మెరుపులు

మేకప్ ఇప్పడు ఆధునిక జీవితంలో ఒక భాగం . కొద్ది పాటి మేకప్ లేకుండా చివరకు షాపింగ్ కు ,ఆఫీస్ కు కూడా పోరు. అందులో భాగంగా లిప్ స్టిక్ వేసుకోవటం కూడా , కాస్త ప్రత్యేకంగా కనిపించాలంటే సియెట్ లండన్ గ్లిటర్ ప్లిప్ ఉంటే చాలు. పెదవులకు గ్లిట్టర్ మెరుపులోస్తాయన్నమాట. ఈ లిప్ స్టిక్ వేసుకొన్నప్పుడు సాదాగా మామూలు లిప్ స్టిక్ పూత లాగే ఉంటుంది. కావాలనుకొన్నప్పుడు రెండు పెదవులను బిగించి అదిమి పెట్టి మళ్ళీ మామూలుగా తెరిస్తే చాలు పెదవుల పైన గ్లిటర్ మెరుపులు తళుకులు వచ్చేస్తాయి. నిమిషాల్లో చేసే మ్యాజిక్ అన్న మాట. వీటిలో అన్ని రంగులు ఉన్నాయి.