వనదేవత ఛామిదేవి 

చెట్ల నరికి వేతను తీవ్రంగా వ్యతిరేకిస్తు తన బృందం తో కలిసి పారాడుతున్నారు ఝార్కండ్ కు చెందిన ఛామిదేవి ముర్ము. ఆమెను లేడీ టార్జాన్ అంటారు కలప మాఫియా నక్సల్స్ కార్యకలాపాల కారణంగా వేగంగా కనుమరుగవుతున్న అడవులను కాపాడటం ద్వారా వన్య ప్రాణులను రక్షించే లక్ష్యం తో పని చేస్తోంది ఛామిదేవి ,ఝార్కండ్ లోని బారసాయ్ గ్రామానికి చెందిన ఛామిదేవి కలప, గృహ నిర్మాణాలకు ఉపయోగపడే మొక్కలను నాటుతున్నారు. ఇప్పటికి 25 లక్షల మొక్కలను నాటారు ఛమాదేవి.