అమ్మాయిలను చదువుల సరస్వతులు అనటంలో అతిశయోక్తి లేదు. ఏ సదుపాయాలు,సౌకర్యాలు లేకుండా మావోయిస్టుల గుప్పిట్లో ఉన్న చత్తీస్ ఘడ్ లోని మారుమూల ప్రాంతం దోర్నపాల్ నుంచి మాయా కాశ్యప్ అనే నిరుపేద అమ్మాయి ఏ కోచింగ్ లేకుండానే తానే కష్టపడి చదువుకుని నీట్ ప్రవేశపరీక్ష రాసి అంబికాపూర్ మెడికల్ కాలేజ్ లో సీటు సంపాదించింది. ఎస్టీ కేటగిరిలో 154వ ర్యాంక్ ఓపెన్ కేటగిరిలో 12,315వ ర్యాంక్ సాధించిందట మాయా కాశ్యప్.కనీస సౌకర్యాలు లేని పల్లె ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందిస్తానంటుంది మాయా.

Leave a comment