క్యాబేజి మొలకల్లో ఆరోగ్యం

మొలకెత్తిన గింజల్లో ఆరోగ్యం దాక్కోని ఉన్నది అనే సంగతి అన్ని అధ్యయాలు చెబుతున్నాయి. పరిశోధనలో మైక్రో గ్రీన్స్ వాడకంలోకి తేచ్చారు అంటే అన్ని రకాల ఆకు కూరలు కూరగాయల మొక్కలని మొలకల దశలో తీసుకుంటే మంచి ఆరోగ్యం అన్న దిశలో పరిశోధనలు చేబుతున్నాయి. ఇందులో భాగంగా ఎరుపు రంగు క్యాబేజి మొలకలు ఆహారంలో భాగంగా తిసుకుంటే గుండే జబ్బు ప్రభావం ఉండదు అని తేలింది. మొలకలు వచ్చిన రెండు వారాలలో వాటిని తినడం వల్ల పోషకాలు ఎక్కువగా అందుతాయి. విటమిన్-సి, విటమిన్-ఇ బీటా కిరోటిన్ వంటివి పేరిగిన ఆకుల్లో ఉంటే సూక్ష్మమొలకల్లోని ఆకుల్లో 40% ఆధికంగా ఉంటాయి అని తేలింది.చిన్న మొలకల్లో గ్లూకో సైనాలెట్స్ పాలిఫినాల్స్ శాతం తక్కువ.