నదులు ,కాలువల పైనే కాదు ఏకంగా అడవుల్లో కూడా వంతెనలు నిర్మించారు . వన్య మృగ సంరక్షణ మండలి చేసిన సర్వేలో అడవిప్రాంతాల్లో ఎన్నో జంతువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్న సమయంలో అడవుల్లో ఉండే రోడ్లు దాటుతూ మరణిస్తూ ఉన్నా సంగతి తెలిసింది . ఒక్క నెలలోనే 21 జాతులకు చెందిన 106 వన్యప్రాణులు ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు తేలింది . పర్యావరణ పరిరక్షణ లో భాగంగా జంతువులకు సంరక్షించు కోవాలనే పిలుపులో భాగంగా,ఈ సర్వేని దృష్టిలో పెట్టుకొని మెక్సికో,ఆస్ట్రేలియా ,బ్రెజిల్,లండన్ వంటి దేశాల్లో వంతెనలు నిర్మించారు . ఈ నిర్మాణాలు పూర్తయ్యాక మళ్ళీ సర్వే చేస్తే 90 శాతం ప్రమాదాలు తప్పి పోయాయిని జంతువులు ఈ వంతెనల ఉపయోగించు కొంటున్నాయని తేలింది .

Leave a comment