బిడ్డకు పాలిస్తే తప్పా?

బిడ్డకు తల్లీ స్తన్యం ఇవ్వటం ప్రకృతిలోని ఒక అందమైన విషయం. తల్లికి బిడ్డకు మధ్య ఉన్న ఈ బంధం ఎప్పుడు విడదీయలేనిది. బిడ్డకు అకలైనప్పుడు చనుబాలు ఇచ్చేందుకు నేను ఇంట్లో వున్నానా, పనిలో ఉన్నానా, వీధిలో ఉన్నానా అని చూసుకోలేదు. తల్లి బిడ్డ ఆకలి తీర్చటం ఆక్షణంలో ఆమె ధర్మం. సమాజం దీన్నేందుకు అపరాధం ల చూస్తోంది. బహిరంగ ప్రదేశల్లో సిగరెట్ తప్పు లేదు కానీ తల్లి పాలిస్తే తప్పవుతుందా ? అని ప్రశ్నిస్తోంది చావీ మిట్టల్. టీవీ నటి చావీ మిట్టల్ సోషల్ మీడియాలో తన పోస్ట్ ల ద్వారా స్త్రీలను మోటివేట్ చేస్తూ వుంటుంది. ఇటీవలే రెండో బిడ్డకు జన్మ ఇచ్చిన చావీ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.