భోగుల్లో…భోగుల్లో…భోగ భాగ్యాలా   భోగుల్లో…భోగి మంటల్ల భోగుల్లో ….

తెల్లవారు ఝామునే లేచి భోగి మంటలు వేసుకుని తలారా స్నానం చేసి సంక్రాంతి పండుగని ఆహ్వానం పలుకుదాం.
చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటం పిలుస్తారు.రేగు పళ్ళు,అక్షతలు, నాణాలు కలిపి దిష్టి తీసి పక్కన పడేస్తారు.బొమ్మల కొలువు పెట్టడం సరదా.
భోగి మంటల్లో నీళ్ళు కాచి భోగి పీడ అని ఆ నీళ్ళతో స్నానం చేయిస్తారు. కొత్త బట్టలు వేసుకుని ఊరంతా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పాయసం

         -తోలేటి వెంకట శిరీష

Leave a comment