భయం వేస్తుంది

ఈ ప్రపంచం అంతులేనన్ని అద్భుతాలకు నిలయం.ఎన్నో వింతలు ,ఊహాకు అందని నిగూఢమైన అంశాలు నల్గొండ జిల్లా నల్లమాల అడవిలో ఒక భయంకరమైన చెట్టు ఉంది. ఈ మిస్టీరియస్ ట్రీ దగ్గరకు వెళ్ళేందుకు కూడా స్థానికులు భయపడుతారు. ఈ చెట్టును చుట్టుకొని పెద్ద అనకొండ వంటి సర్పం ఆకారం ఉంటుంది.చెట్టు చుట్టు మొసళ్ళ ఆకారాలు ,తేళ్ళు ,బల్లులు,డైనోసార్ల వంటి భీరకమైన జంతువులు ఈచెట్టు మానుపైన ఎవరో శ్రద్దగా చెక్కినట్లే ఉంటాయి. ఈ చెట్టు పెరుగుతూ ఉండగానే ఇలాంటి భయంకర ఆకారాలు ఎందుకు తయారయ్యాయో ఎలా అంత కరెక్ట్ గా పర్ఫెట్ రూపాలతో ఉన్నాయో అర్ధం కాదు. ఈ అంతుచిక్కని రహస్యం ఏమిటి? ఈ చెట్టు రూపం అలా ఎందుకు ఉందో అంతా మిస్టరీ.