భండారు అచ్చమాంబ 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. ఇది కోస్తాంధ్రలో స్త్రీల మొదటి సంస్థ. 34మంది స్త్రీల జీవిత చరిత్రతో అబలా సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంథాన్ని రచించింది.. శతక పద్యాలు రాశారు. స్త్రీ అభ్యుదయం కోసం కృషి చేశారు. ఈమె రాసిన కథలో 11 కథలు దొరికాయి. అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో కొమర్రాజు వెంకటప్పయ్య,గంగమ్మ దంపతులకు జన్మించారు.

Leave a comment