కోచి ఎయిర్ పోర్ట్ కు 16 కిలోమీటర్ల దూరంలో ఉండే   ఆలువా  రైల్వే స్టేషన్ అత్యంత అందమైన రైల్వే స్టేషన్ గా పేరు తెచ్చుకొంది . స్టేషన్ చాలా పరిశుభ్రం గా ఉంటుంది.ఒక చిన్న కాగితం ముక్క కూడా ట్రాక్ పైన  కనిపించదు .ట్రాక్ మధ్యలో ఉండే బారికేడ్ కు ప్లాస్టిక్ బాటిల్స్ లో పెంచిన చైనా రోజ్ మొక్కలు , పువ్వులతో కళకళలాడుతూ కనిపిస్తాయి .రైల్లోంచి విసిరేసిన ఖాళీ బాటిల్స్ పోగుచేసి వారికీ చిన్నచిన్న రంద్రాలు చేసి వాటిలో చైనా రోజ్ మొక్కలు పెంచుతారు వీటికి   మైంటెనెన్సు   అవసరం  లేదు .ప్రయాణికులకు తేలిగ్గా ఉంటుందని రైల్వే ట్రాక్ దాటేస్తూ ఉంటారు .ఈ మొక్కలున్న బాటిల్స్ కారణం గా ట్రాక్ దాటే  వీలులేక ఫుట్ బ్రిడ్జ్ ని ఉపయోగిస్తున్నారు .అలాగే ఇంత అందం గా , క్లీన్  గా కనిపిస్తున్నా  స్టేషన్ ను పాడుచేయలేక ఇప్పుడు ప్రయాణికులు కూడా మురికి చేయకుండా ఉంటున్నారు . స్టేషన్ సిబ్బంది కృషి వల్లనే ఇదంతా సాధ్యం అయింది .

Leave a comment