సినీ సెలబ్రెటీలు ప్రమోట్ చేశాక,సమంత వంటి టాప్ హీరోయిన్లు మాకు టాటూలు ఇష్టమని ప్రకటించాక అమ్మాయిలు ఊరుకుంటారా ?టాటూ వేయించుకోవాల్సిందే అనేస్తారు . అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అంటారు ఎక్స్ పర్డ్స్ . టాటూ వేయించుకొన్నా మూడుగంటల్లో బ్యాండేజ్ తీసేయాలి యాన్తి సెప్టిక్ ఆయింట్ మెంట్ రోజుకు మూడుసార్లు అప్లయ్ చేయాలి .స్నానం సమయంలో కూడా రెండుమూడు రోజులు ఈ టాటూని తడపకూడదు . ఎక్కువసేపు ఎండ తగల నీవ్వ కూడదు.  మాయిశ్చరైజర్ నాలుగో రోజునుంచి రాయాలి . కనీసం మూడువారాల పాటుమాయిశ్చరైజర్ అప్లై చేయాలి . టాటూ మెరుపుపోకుండా  సన్ స్క్రీన్ వాడాలి టాటూని ,గిల్లటం, గోకటం ,చేయకూడదు . ఇంత కష్టం ఎందుకు,ఇలా పర్మినెంట్ టాటూ తో శరీరంలో చొరబడే రసాయనాలతో కష్టం.  కానీ ఏదైనా టెంపరరీ టాటూ అతికించుకోండి ఏ సమస్యా ఉండదు అంటున్నారు ఎక్స్ పర్డ్స్

Leave a comment