నా ప్రతి కథకీ ,నవలకీ ఒక నేపథ్యం ఉంది,తీపి జ్ఞాపకాలున్నాయి.అంటుంది రచయిత్రి బలభద్రపాత్రుని రమణి. కథల నిండా పల్లెటూరి కబుర్లుంటాయి కథల్లో సమస్య, దానికి చక్కని పరిష్కారం కూడా ఉంటుంది శిక్ష కథలో వీణ భర్త వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు.  కుటుంబ సభ్యులు అతనితో విడాకులు తీసుకోమని చెప్తారు. మీనా ఒప్పుకోదు ఆమె భర్త ఇంకో పెళ్లి చేసుకోలేక, గవర్నమెంట్ జాబ్ పోతుందనే భయంతో వీణను చాలా హింస పెడతాడు . తర్వాత ఎప్పుడో తనకు యాక్సిడెంట్  జరుగుతుంది .అప్పటి వరకు ఓర్పుగా ఉన్న వీణ అతన్ని వదిలేస్తుంది. తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సుఖంగా ఉంటావని కోపంతోనే ఇదంతా భరించాను .నా వైపు నుంచి నీకు విధించే శిక్ష ఇది. ఇప్పుడు ఈ సేవ చేయవలసిన బాధ్యత కానీ అవసరం కానీ నాకు లేదంటుంది.  భార్యలను వంచించే భర్తలకు గుణపాఠం ఈ కథ. ఇలాంటి చక్కని కథలు ఇవన్నీ .

Leave a comment