అవసరమైన ఖనిజం

శరీరానికి అవసరమైన అనేక ఖనిజ పదార్థాలలో మాంగనీస్ చాలా ముఖ్యం. ఇనుము,రాగి వంటి ఇతర ఖనిజాలతో పాటు ఇది శరీరానికి మేలు చేస్తుంది. మాంగనీస్ తగినంత శరీరంలో లభించకపోతే శరీరంలో కీళ్ళ నొప్పులు ,పక్షవాతం,అంధత్వం వస్తాయి. పిల్లలకు చెవుడు రావచ్చు. ఎక్కువైతే కోపం వస్తుంది.ఆహారం జీర్ణం చేసేందుకు ,జీర్ణమైన దానిని శక్తిగా మార్చే ఇ,బి విటమిన్ లు మెటబాలిజంలకు మాంగనీస్ పనికి వస్తుంది. పురుషులు సెక్స్ సామార్థ్యానికి మాంగనీస్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ మాంగనీస్ కోసం మొలకెత్తుతున్న గింజలు ,మామిడి,పుచ్చ కాయలు ,మొక్క జోన్నలు ముఖ్యంగా అరటి పండు ,గోధుమలు వంటి పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరం ఎదుగుదలకు అవరమైన ప్రోటీన్లను విడగొట్టి శక్తి ని అందిచటంలోమాంగనీస్ ప్రధాన పాత్ర వహిస్తుంది.