మలబార్ తీరంలో పుట్టిన దాల్చిన చెట్టు బెరడును మనం దాల్చినచెక్కగా వాడుతాం . ఈ మొక్క ఎతైన కొండల్లో పెరుగుతుంది . ఆకులు దళసరి గా పెళుసుగా ఉంటాయి . చెట్టు ఆరు నుండి ఎనిమిది మీటర్లు వరకు పెరుగుతుంది . చిన్ని పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి . కొమ్మలు నరికి బెరడును వలచి ఎండబెడతారు . ఈ మొక్కల నుండి తీసిన నూనె ఎంతో పరిమళంతో ఉంది స్వీట్స్ తయారీలో సబ్బులు ,క్రిములు వగైరా టీ తయారీలో బేకరీ ఉత్పత్తులు ,శీతల పానీయాలు తయారుచేసేందుకు ఉపయోగిస్తారు . దాల్చిన చెక్క చర్మంలో కొల్లా జెన్ ఉత్పత్తిని పెంచేందుకు సాయపడుతుంది . చర్మం మృదువుగా సున్నితం గా మారేందుకు కూడా బాగా సహాయపడుతుంది

Leave a comment