కొన్ని అలవాట్లు జుట్టు రాలిపోడానికి కారణం అంటున్నారు ఎక్సపర్ట్స్. సాధారణంగా వెంట్రుకలు మెడపై వేలాడకుండా గట్టిగా కట్టి బిగించి ఆలా గంటల తరబడి ఉంచేస్తారు. ఆలా చేస్తే మూలల్లో వెంట్రుక బలహినమై రాలిపోతుంది. వెంట్రుకలకు నూనె పట్టించటం,హెయిర్ మాస్కలు తప్పనిసరిగా వేసుకోవాలి తలస్నానం తర్వాత జుట్టు ఆరేందుకు డ్రైయర్ వాడక పోవటం బెస్ట్ వెంట్రుకలకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. హెయిర్ ప్రోడక్ట్ లో కూడా కొన్ని రసాయనాలు ఉంటాయి. కానీ తరుచూ బ్రాండ్ లు  మార్చకూడదు. అనేక రకాల ఉత్పత్తులు వరుసగా అప్లై చేస్తే వెంట్రుకలు దెబ్బతిని రాలిపోతాయి. అలాగే  తరచు తలస్నానం కూడా మంచిది కాదు. కాలుష్యం ఎక్కువై తల మురిగ్గా అనిపిస్తేనే తలస్నానం చేయాలి.

Leave a comment