వ్యాయామం చేసేందుకు సమయం సరిపోకపోతే దిన చర్యలో కొద్ది పాటి మార్పులతో వ్యాయామం చేసిన ఫలితం పొందవచ్చు. ఆఫీస్ లో అయినా ఇంట్లో అయినా ఫోన్ వస్తే కూర్చోకుండా నడుస్తూ మాట్లాడేందుకు అలవాటు పడవచ్చు. అదే పనిగా కూర్చుని ఉంటే కండరాలు అలసి పోతాయి. నిలబడితే స్ట్రెయిట్ గా నిటారుగా నిలబడాలి. కనీసం ఇరవై నిమిషాల నడక లేదా రోజు మొత్తంపైన ఐదు నిమిషాల చొప్పున కనీసం పదిసార్లు ఎలాగైన శరీరం యాక్టివ్ గా ఉంచుకోగలగితే చాలు . పోషకాహారం తీసుకొంటూ కూరలు పండ్లు ఎక్కువగా తింటూ ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లే.

Leave a comment