నీహారికా ,

నాపైన ఎవరన్నా చిన్నగా విసుక్కున్నా కోపం తెచ్చుకున్నా నాకు చాలా కోపం వచ్చేస్తుంది . చదువుకోవటం కూడా చిరాగ్గా ఉంటోంది అన్నావు బావుంది. అప్పుడు నిన్ను గురించి నువ్వు నీవైపు తప్పువుందా అని ఆలోచించావా ? ఎదుటివాళ్ళ ఉద్వేగాన్ని మనం యధాతధంగా అర్ధం చేసుకోవాలనిపించలేదా .. ఇప్పుడు తప్పు నీదే . ఇంట్లో వాళ్ళనుకో వాళ్లకు నీ వల్ల  కలిగిన చిరాకు ఏమిటి ? నా వైపు నుంచి ఎంత తప్పువుందో ఓ నిముషం ఆలోచిస్తే చేసిన తప్పుకు సారీ చెప్పేస్తే సరిపోతుంది . మధ్యలో నీకు కోపం రావటం ఏమిటి ? ఇప్పుడు నువ్వు సెన్సిటివ్ గా మనసుతో ఆలోచించకుండా తీక్షణంగా బుద్ధితో ఆలోచించాలన్నమాట. అంటే బుర్రతో ఆలోచించి అరె తప్పు నాదనే  అనుకోవచ్చు లేదా అనవసరంగా నా పైన విసుక్కున్న వాళ్ళను నిలదీయచ్చు. ఇక బయటవాళ్ళనుకో అప్పుడు ఇదే ముందు ఆలోచన చేయి . వెంటనే కోపం తెచ్చేసుకుని నీ బలహీనత బయట పెట్టకుండా అసలు నేనింత బాధపడటం అవసరమా ? దీనివల్ల నాకొచ్చిన లాభమేమిటి ? ఈ చిరాకు కోపం వల్ల  నేనెంత నష్టపోతున్నాను. అసలా ఉద్వేగానికి లోనైనప్పుడు నేనెలా ఉంటున్నాను ? ఇలా ఆలోచించు . ఇప్పుడు నీ ఆలోచనలు అలా సుడిగాలి లాగ నీ చుట్టూనే తిరిగి నిన్ను గందరగోళం లోకి నెట్టకుండా   దూదిపింజెల్లా ఎగిరిపోతాయి. అతి సున్నితత్వం అనే మానసిక స్థితి నుంచి ముందు బయటకు రా .. ప్రాక్టికల్ గా వుండు.

Leave a comment