ఆరుబయట ఆడనివ్వండ

పిల్లలకు ఆరుబయట ఆటలు చాలా ముఖ్యం, కండరాలు ఎముకలు బలోపేతం అవ్వడానికే కాదు. భావోద్వేగాల నియంత్రించుకొని తోటి వాళ్ళతో స్నేహాసంబంధాలకు కూడా తోటి పిల్లలతో ఆడుకోవటం చాలా ముఖ్యం . ఆరుబయట ప్రకృతిలో తోటిపిల్లలతో ఆడుతూ ఉంటే అది శ్రమ తెలియని వ్యాయామం. అప్పుడే పిల్లలకు హస్వదృష్టి ముప్పుతగ్గుతోందని ఒక పరిశోధన చెపుతుంది.కలివిడి తనం క్రీడా నైపుణ్యం పెరుగుతోంది. ఆటలో ఎత్తుగడలు ,ఎదుటి వారిని అంచనా వేసే శక్తి పెరగుతోంది.బృందాలుగా ఆడే ఆటలు సమిష్ఠితత్వం బోధపరుస్తారు. విటమిన్ డి లోపం ఉండదు. ఊబకాయం ముప్పు అసలేరాదు. శారీరక పటుత్వంపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతోంది.