ఒక ఊరంటే వేల సంఖ్యలో ఇళ్ళు ,రోడ్లు,పరిపాలనా వ్యవస్థ ఉంటాయి . కానీ ఒకే ఒక అపార్ట్ మెంట్ పట్టణం అంటే నమ్మశక్యంగా ఉంటుందా?. అమెరికాలోని అలస్కా స్టేట్ లో ఉన్న ఓ 14 అంతస్థుల బిల్డింగ్ ని పట్టణంగా పిలుస్తారు . 1948 లో అలస్కా లోని విలియమ్ ప్రాంతంలో సైనికులు 14 అంతస్థుల అపార్ట్ మెంట్ ను నిర్మించి కుటుంబాలలో సహా నివాసం ఉండేవాళ్ళు . దానితో ఇంకో రెండు భవనాలు కట్టి విట్టియార్ పేరుతో దాన్ని ప్రత్యేక పట్టణంగా పిలిచేవాళ్ళు . ప్రత్యేక పరిపాలనా విభాగాలు ఏర్పడ్డాయి . అప్పట్లో 1200 మంది సైనికులు అపార్ట్ మెంట్లో ఉండేవారు ఇప్పుడు కొందరే ఉన్నారు . మూడుభావనాల్లో ఒకదాన్లో స్కూలు నిర్వహిస్తున్నారు . స్కూలుకి అపార్ట్ మెంట్కి మధ్యలో ఉండే సొరంగమార్గం గుండానే రాకపోకలు జరుగుతాయి . కిరాణా దుకాణం,పార్క్ ,జిమ్ వంటి సమస్త సౌకర్యాలున్నాయి . ఇది పర్యాటకంగా అభివృద్ధి చెందటం వల్ల పై అంతస్థులో సందర్శకులకు వసతి ఏర్పాట్లున్నాయి .

Leave a comment