భారతదేశ చరిత్రలో ఎన్నో రామకథలున్నాయి కానీ  రచయత్రి పి.సత్యవతి  సంకలనంలో వ్యాస రచయతలు వాల్మీకి రామయణం ఒక్కటే కాదని ప్రాంతీయ సాహిత్య సంప్రదాయాలు,మాతాచారాలు,అభిరుచులు,నృత్యప్రక్రియలో ఎన్నో రకాల రామాయణాలు పురుడు పోసుకున్నాయని విశ్లేషించి చెబుతారు.ఇందులో ఏడు వ్యాసాలున్నాయి. రిచ్మన్,ఏకే రామనుజన్,వేల్చేరు నారాయణ రావు,పెరియార్ నారాయణ స్వామి వంటి గొప్ప రచయతలు వీటిని పునర్ రచించారు.వాల్మీకి రాసిన రామాయణంలో తరువాతి తరంలో కొత్త రచయతలు అందులో ఎలాంటి మార్పులు చేశారు.ఆ మార్పులన్ని రామున్ని మానవరూపంలో ఉన్న భగవంతున్ని నిరూపించేందుకే జరిగాయి అంటారు రచయతలు.ఇటు భారతదేశం నుంచి టిబేట్,భర్మా,థాయిలాండ్,కంబోడియా,మలేషియా,ఇండోనేషియా రామకథల్లో వైవిధ్యభరితమైన కథనాలున్నాయి అంటారు రామానుజన్.జైన రామయణంలో రావణుడే నాయకుడు.జైన గురువు భక్తుడు కూడా మౌఖింగా అంటే కేవలం వినడం ద్వారా పుస్తకరూపంలో కాకుండా తరాల నుంచి తరాలకు ప్రజలకు కానుకగా అందిన ఈ రామాయణ కథనం గురించి తెలుసుకోవాలంటే అనేక రామాయణాలు చదవాలి.-పి.సత్యవతి  ప్రతుల వివరాలకు హైదరాబాద్ ట్రస్ట్ ఫోన్ నం:040-23521849.

Leave a comment