నిహారిక ,

ఇప్పుడుఇక పరీక్షల హడావిడి మొదలయిపోయింది. ప్రతి వాళ్ళు పిల్లల పైనా ద్రుష్టి పెడతారు. ఇక ఇప్పుడు మిగతా పిల్లలతో కలిసి పోల్చిచూసుకోవడం మొదలు పెట్టారు.పిల్లలు లో అనేసారు కూడా నువ్వు ఫలానా వాడి లాగ లెవు అని.కానీ వాళ్లు మరిచిపోయే విషయం ఒకటి వుంది.మనం పిల్లల ని ఒకే ప్రేమ తో చూస్తాం. చక్కగా ఉదయినే నిద్ర లేపి,పెట్టింది తిని,స్కూల్ కి పంపి బాగా చదువుకుని ఫస్ట్ క్లాసులు సంపాదించిన పిల్లలు. ఏ పిల్లలైన అలాగే వుండాలిని ఊహలో వుంటారు కాని మన పిల్లలో ఉండే అనేక మంచి లక్షణాలు, ప్రత్యేకేమైన గుణాలు గురించి ఆలోచించారు. ప్రతీ పిల్లవాడి లో ఒక భవిష్యత్తు వుంటుంది.వాళ్లు వాళ్లకి వచ్చిన,నచ్చిన పని అద్భుతం గా చేయగలరు. అందరూ బాల మురళీ కృష్ణా లాగా పాడగలరా?రాజా రెడ్డి,రాధ రెడ్డి లాగా డాన్స్ చేయగలరా?కలాం లాగా స్పేస్ సైంటిస్ట్స్ అవ్వగలరా. ప్రతీ బిడ్డ లోను ఎంతో శక్తి వుంటుంది. వాళ్లని ఒకే కొలమానం తో చూస్తే నష్టం మనకే.

Leave a comment