అందాన్నిచ్చే ప్యాక్ లు

చర్మం మెరుపు కోసం ఎన్నో రకాల క్రీమ్స్ ఉపయోగిస్తారు. కానీ ఇంట్లో తయారు చేసే కొన్ని మిశ్రమాలు మొహనికి ఎనలేని కాంతిని ఇస్తాయి అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. బియ్యం,నువ్వులు కలిపి రాత్రంతా నానబెట్టాలి. వాటిని మెత్తగా రుబ్బి ఆ మిశ్రమంతో మొహానికి ప్యాక్ వేసుకోవాలి. ఐదు నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటిలో కడిగేస్తే చర్మం తేమగా ఉంటుంది. అలాగే తేనె ముల్తాన్ మట్టి మిశ్రమంతో ప్యాక్ వేసి పావుగంట తర్వాత మొహంపై ఆరిపోయిన ప్యాక్ ను మసాజ్ చేసినట్లు వేళ్ళతో రుద్దితూ కడిగేస్తే ముఖం చాలా కాంతిగా ఉంటుంది.ప్యాక్ కడిగేశాక మొహం పొడి బారీ పోకుండా కోల్డ్ క్రీమ్ రాస్తే సరిపోతుంది.