అందం గురించే ఆలోచన

ఈ మధ్య కాలంలో నా ఆలోచనా తీరు చాలా మారింది అంటోంది కాజల్ అగర్వాల్ . ఇంతకు ముందు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా అందంగా కనిపించాలని నాకేంతో తాపత్రయం ఉండేది . స్టార్ట్ కెమెరా అనగానే నేను నటించాల్సిన ఎమోషనల్ కంటే నేను అందం గా కనిపిస్తున్నానా లేదా అనే ఆలోచనే ఎక్కువ కానీ అది కరెక్ట్ కాదని అనుకొన్నా . నన్ను నేను విశ్లేషించు కోవటంలో ఒక లాభం ఇది . ఆ తరువాత ఆ భావోద్వేగాల పైనే దృష్టి పెట్టటం మొదలు పెట్టాను . కానీ సన్నివేశం లో నేను బాగా నటించేదాన్ని పైగా కొత్తగా నా అందం విషయం లోనూ నాకు తేడాలేమీ కనిపించలేదు అంటోంది కాజల్ అగర్వాల్.