అమ్మ నాన్నలే అసలు సమస్య

పిల్లలు పైన ప్రేమతో మంచి ఆహారం ఇస్తారు తలితండ్రులు వాళ్ళు అడిగిన చాక్లెట్స్ ఆయిల్ ఫుడ్,జంక్ ఫుడ్స్ స్వీట్లు కూల్ డ్రింక్స్ వెంటనే ఇస్తారు ఇలా క్రమశిక్షణ లేకుండా ఆహారం తీసుకోవటం తలిదండ్రుల నియంత్రణ లేకపోవటం వల్ల పిల్లలు బరువు పెరిగిపోతారు ఒకసారి బరువు పెరిగారు ఆ తర్వాత ఆ బరువు వదిలించుకోవటం కష్టం వాళ్ళ చేత వ్యాయామాలు చేయించాలి ఆహార నియంత్రణ పాటించాలి అవన్ని అర్థంచేసుకోలేని పిల్లలు సహకరించారు. పైగా వారైతే వద్దని అంటారు అవన్నీ తినాలంటారు. పుట్టినప్పటి నుంచి వచ్చిన అలవాటు మనుకోలేక పోతారు పైగా బయటి పిల్లలు వెక్కిరించుట,స్కూల్లో ఉత్సహంగా ఆటపాటల్లో పాల్గొనలేకపోవటం పిల్లలని బాధిస్తాయి. ఈ పరిస్థితికి తామే కారణం అని తలితండ్రులు గుర్తిస్తేనే సమస్య పోతుంది.