వృత్తిని ప్రేమిస్తే అన్ని సాధ్యమే 

బాలీవుడ్ లో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు దాటినా అదే ఉత్సహం తో ఉండటం ఎలా సాధ్యం అని అడిగితే కరీనా కపూర్ పనిని ప్రేమిస్తూ,దాన్ని క్రమశిక్షణతో పూర్తి చేస్తే మనలో ఆ ఉత్సాహం,పట్టుదల అన్ని ఉంటాయంటోంది. ఏ పాత్ర నటిస్తే ఆ క్షణాలను ఆస్వాదిస్తాను,వృత్తికి వ్యతిగత జీవితానికీ మధ్య అనే  రేఖని ఎప్పుడు దాటను. దేని సమయం దానికే కేటాయిస్తాను అలాగే శరీరానికి అవసరం అయ్యే ఆహారం మాత్రమే తీసుకొంటాను. రోజు గంటసేపు వ్యాయామం చేస్తాను మనసు ప్రశాంతంగా ఉంచుకొంటాను.ఆ సంతోషమే మోహంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఎలాటి సమస్యలు లేని జీవితం సాధ్యమేనా అలా ప్రశాంతంగా ఉండగలను అనుకొంటే జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వాస్తు వుంటాయి కష్టం సుఖం అన్నింటినీ సమభావనలో తీసుకొంటే ఏదయినా సాధ్యమే అంటోంది కరీనా.