అలా ఎత్తేస్తే నొప్పి

అలవాటుగా అలవోకగా చేసే కోన్ని పనులు మన శారీరక అకృతి పై ప్రభావం చూపించి వెన్ను పై వత్తిడి తెస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శరీరానికి నొప్పి తెలియకుండా పనులు చేసుకోవచ్చు. బ్రష్ చేసుకునే సమయంలో సింక్ దగ్గర నిటారుగా నిలబడి ఉంటారు. అలా కాకుండా గోడకు చేతిని దన్నుగా ఉంచుకుంటే వెన్ను పై ఒత్తిడి పడదు. పాత్రలు తోమే సమయంలో ఒక తేలికపాటి ప్లాస్టిక్ కూర్చిని వేసుకోని మోకాలుని మడిచి దానిపై ఉంచుకుంటే వెన్నుపై భారం పడదు.బూట్లు లేస్ లు కూడ దోంతు కూర్చోని గాని లేదా కూర్చిలో కూర్చోని గాని కట్టుకోవాలి.బరువైన వస్తువులు అలా తేలిగ్గా పైకిత్తే వారు వంచిన మోకాలుపై ఆనిచ్చి భుజందాకా నెమ్మదిగా పైకెత్తితే ఒత్తిడి నడుము పై పడదు.