సాధారణంగా రోజుకు 13వేల సార్లు కళ్ళు ఆర్పుతుంటారని చెపుతారు. కళ్ళు పొడిబారిపోకుండా ఉండేందుకు గానూ ఇది శరీరపు ఏర్పాటు అనుకొంటాం. కానీ కళ్ళు మూసుకోవటం తెరవటం వెనక ఇంకో లాభం ఉంది అంటారు నెదర్లాండ్స్ పరిశోధకులు. ఈ సైకో లింగ్విస్టిక్ నిపుణుల పరిశోధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొంటూ ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకొంటూ ఉంటారు. ఒకళ్ళు మాట్లాడుతుంటే రెండో వాళ్ళు తల ఆడిస్తూ వింటూ ఉంటే కనురెప్పలు మూత పడుతూ ఉంటాయి. ఇవతలి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకొనేందుకు కూడా ఈ కళ్ళు మూసుకోని తెరవటం, అవకాశం ఇస్తుందనీ చెప్పేది విని శ్రధ్దగా ఆకళింపు చేసుకొనేందుకు ఈ రెప్పపాటు సమయం ఉపయోగించుకొంటూ ఉంటారంటున్నారు.

Leave a comment