“ఆదిశక్తి  ప్రసాదం”

జననీ…శివ కామినీ..జయ శుభోదయం కారిణి.. విజయ రూపిణీ!!
కర్నాటక లోని తూముకూరు జిల్లాలో వెలసిన ఆదిశక్తి గురించి తెలుసుకుందామా!!
ఎంతో మహత్యం కలిగిన ఆదిశక్తిని దర్శించటం ఎన్నో జన్మల పుణ్యం.

తూముకూరు దగ్గరలో ఉన్న గ్రామంలో రామలింగప్ప గొర్రెలు కాచుకోవటానికి దేవశ్రి అనే కొండ పైకి వెళ్ళే వాడు.ఆ రోజు కూడా బయలుదేరాడు అతనికి ఒక స్త్రీ కంఠస్వరం వినిపించింది “నేను కూడా నీతో వస్తాను” అని.రామలింగప్ప భయభ్రాంతుడైనాడు.ఆ స్వరం అతనికి మాత్రమే వినిపించేది.
ఒకనాడు ధైర్యం చేసి ఆకాశవాణికి సమాధానం చెప్పాడు.తనతో తన ఊరికి విచ్చేయమన్నాడు.ఆదిశక్తి ఆనందంతో అమావాస్య రోజు అర్ధరాత్రి తనతో వస్తాను అని శెలవిచ్చింది.ఊరి జనంతో బయలుదేరి వెళ్లి దేవిని ఆహ్వానించారు.ఒక ప్రమిద రూపంలో ప్రత్యక్షమైన ఆదిశక్తిని గ్రామంలో కొబ్బరి ఆకులతో అలంకరించి సేవ చేసే భాగ్యం కలిగింది.
ఇష్టమైన పూజలు: నిత్యం ప్రసన్న వదనంతో అన్ని పూజలు స్వీకరించి వరాలను ప్రసాదిస్తూంది.
    నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు.

         -తోలేటి వెంకట శిరీష