పిల్లలకు ఏడెనిమిది నెలలు నిండి, తల నిలపడం వస్తే వెంటనే వాకర్ కొంటారు పేరెంట్స్. పిల్లలు హాయిగా అందులో కుర్చుని, కాళ్ళతో తన్నుకుంటూ ఇల్లంతా పరుగులు పెట్టేస్తూ వుంటే చూడ ముచ్చటగా వుంటుంది. అయితే ఈ సౌకర్యం వల్ల పిల్లలకు నష్టం ఎక్కువ అంటున్నాయి పరిశోధనలు. వాకర్ అలవాటు తో ఎదుగుదల మండగిస్తుందని పరిశోధకులు అంటున్నారు. వాకర్ వాడని పిల్లలు త్వరగా పరడటం నుంచి నెమ్మదిగా భూమిని ఆధారంగా లేచి కూర్చుంటూ, నిలబడుతూ నడుస్తూ బాగా ఎదుగుతున్నారని అదే వాకర్ లో కూర్చునే పిల్లలు కాస్త వెనకబడే ఉంటున్నారని పరిశోధనలు చెప్పుతున్నాయి. పిల్లల ప్రతి విషయం సొంతంగా నేర్చుకునే దిశగానే వాళ్ళని పెంచాలన్నారు.

Leave a comment