Categories
WhatsApp

వాళ్ళకి కొత్త స్కిల్స్ నేర్పండి

పిల్లలకు సెలవులిచ్చారు. తోచడం లేదంటారు. సరే ఆడుకో అనగానే ఎందల్లోకి పరుగు తీసేందుకు సిద్ధంగా ఉంటారు. బయటి ఎండ తక్షణత పెద్దవాళ్ళు అర్ధం చేసుకున్నట్లు పిల్లలకు అర్ధం కాదు. పొనీ ఇంట్లోనే వుండండి. అంటే టి.వి ముందు, సెల్ ఫోన్ లో గేమ్స్ కో అతుక్కు పోతారు. ఈ సమయంలో వాళ్ళకి తోచేలా, కాసేపు ఆటవిడుపులా కొన్ని కొత్త స్కౌర్సీ నేర్చుకునేందుకు ప్రోత్సహించాలి. వంట ఇంట్లో సయం చేసే అలవాటు చేయాలి. వాళ్ళకు చిన్న పప్రాన్, హ్యట్ కొనిస్తే ముందు వంట చేసే ఉత్సాహం వచ్చేస్తుంది. కొన్ని తాయిలాలు ఇవ్వాలి మరి. పెద్దగా స్టవ్ పని లేని ఆమ్లెట్స్, శాండ్ విచ్, భాట్ మొదలైన వాటిని పిల్లలకు నేర్పించోచ్చు. అలాగే డబ్బు ఎలా హ్యాండిల్ చేయవచ్చో నేర్పించాలి. డబ్బు విలువ నేర్పుతూ, వారికి కొంత డబ్బు ఇచ్చి బాధ్యతాయుత ధోరని అలవర్చాలి. వారిలోని పర్ ఫార్మెన్స్ ను మెరుగు పరచాలి. ఇందుకోసం సమయం కేటాయించ గలిగితే చాలు అన్నింటికన్నా ముఖ్యంగా మనవ సంభందాలు, కుటుంబ సంభందాలతో పిల్లల్లా కనెక్ట్  చేయగలిగితే, కుటుంబ బంధుత్వాలతో వాళ్ళని కలుపగాలిగితే అది నిజంగా మన అచీవ్మెంటే అవుతుంది.

Leave a comment